POSTAL JCA NFPE AND FNPO
తపాల శాఖ లో సుమారు 17093 పోస్టుల రద్దు కు నిరసనగా
పోస్టల్ జె. సి. ఎ ఆధ్వర్యములో
తేది .28-12-2012 న
సర్కిల్ ఆఫీసు / రీజినల్ ఆఫీసు / డివిజనల్ ఆఫీసు ల వద్ద
నిరసన ప్రదర్శనలు
ప్రభుత్వ శాఖల కుదింపునకై ఏర్పాటు
చేయబడిన స్క్రీనింగ్ కమిటీ 2001 నుండి 2008 వరకు 1/3 భాగం పోస్టుల భర్తీ కి
అనుమతించి 2/3 భాగం పోస్టులను రద్దు చేసిన విషయము తెలిసినదే. దాని
ప్రకారము పోస్టల్ శాఖ లో 2001 నుండి 2004 వరకు 2/3 భాగం పోస్టులను పూర్తిగా
రద్దు చేసినది.
కాని 2005 నుండి 2008 వరకు రద్దు
చేయవలసిన పోస్టుల విషయములో తపాల శాఖ మరియు కమ్యునికేషన్ల మంత్రిత్వ శాఖ
కలసి తపాల శాఖకు మినహాయింపు నివ్వవలసినదిగా ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చేసిన
అభ్యర్ధన మేరకు 2005 నుండి 2008 వరకు జస్టిఫైడ్ పోస్టులు రద్దు చేయకుండా
ఖాళీగా వుంచడం జరిగినది. వీటిపై ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ అనుమతి
నివ్వవలసియున్నది.
2008 లో స్క్రీనింగ్ కమిటీ రద్దు
చేయబడి 2009 నుండి ఖాళీ పోస్టులను భర్తీ చేసుకొనుటకు ప్రభుత్వము
అనుమతించినది. దాని ప్రకారము 2009, 2010 పోస్టుల భర్తీ జరిగినది. మరియు
2011, 2012 ఖాళీలకు కూడా ఉత్తర్వులు ఇవ్వబడినవి.
కాని 2005 నుండి 2008 వరకు ఫైనాన్స్
మినిస్ట్రీ అనుమతి కొరకు రద్దు చేయకుండా ఖాళీగా ఉంచబడిన పోస్టులను ఎట్టి
పరిస్థితులలోను భర్తీ చేయకుండా ఖాళీగానే (రద్దు చేయుట కొరకు ) ఉంచ
వలసినదిగా డైరెక్టరేట్ అన్ని సర్కిల్స్ చీఫ్ పి .ఎం .జి లకు
వుత్తర్వులిచ్చినది.
స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం
రద్దు చేయుటకు అవకాశము గల పోస్తులన్నింటిని ఏ శాఖకు కూడా ఎటువంటి
మినహాయింపు / అనుమతి లేకుండా రద్దు చేయవలసినదిగా ఫైనాన్స్ మినిస్ట్రీ
వుత్తర్వులిచ్చినది.
దీని ప్రకారము 2005 నుండి 2008 వరకు
తపాల శాఖలో గత 4 సం . లుగా రద్దు చేయకుండా ఉంచబడిన 17093 పోస్టులు రద్దు
చేయవలసినదిగా తపాల శాఖ ఉత్తర్వులు యిచ్చినది.
కేడర్ ప్రకారం వున్న పోస్టుల వివరములు :
Cadre
|
No. of Posts
|
Cadre
|
No. of Posts
|
IP – Postal
|
1
|
Driver – Grade.III
|
14
|
PA – Postal
|
5010
|
Driver – MMS
|
84
|
PA – CO / RO
|
138
|
Postal Accounts – JA
|
125
|
PA – SBCO
|
385
|
LDC
|
186
|
PA - RLO
|
11
|
Group – D
|
118
|
PA – Foreign Post
|
18
|
Sorter
|
31
|
PA – MMS
|
12
|
Hindi Typist
|
1
|
SA – RMS
|
1259
|
Steno
|
2
|
POSTMAN
|
3230
|
Steno – Gr.C
|
43
|
Group-D – Postal
|
4407
|
Jr. Hindi Translator
|
8
|
Group-D – RMS
|
1336
|
Hindi Typist
|
1
|
Group-D – MMS
|
81
|
All Others
|
411
|
Group-D – CO/ RO
|
67
|
TOTAL
|
17093
|
Group-D – PSD
|
90
|
||
Gropu-D – others
|
24
|
ఈ ఖాళీలో జి. డి. ఎస్ లకు అవకాశమున్న వేలాది పి .ఎ ., పోస్ట్ మాన్ , గ్రూప్-డి పోస్టులు రద్దు అగుచున్నవి.
పోస్టల్ జె.సి.ఎ (ఎన్.ఎఫ్.పి.యి
& ఎఫ్.ఎన్.పి. ఓ ) ఆధ్వర్యములో 28-12-2012 తేదిన నిరసన ప్రదర్శనలు
నిర్వహించి కమ్యునికేషన్ల మంత్రిగారికి , తపాలశాఖ కార్యదర్శిగారికి
సేవింగ్రామ్స్ పంపవలసి నదిగా పిలుపు నివ్వడమైనది .
CONDUCT
PROTEST DEMONSTRATIONS ON 28-12-2012
SEND
SAVINGRAMS to Minister, Communications and Secretary, Department of Posts
TEXT
OF SAVINGRAM
STRONGLY
PROTEST THE ABOLITION OF 17093 POSTS in
Department of Posts XXX UNABLE TO MANAGE THE DAY-TO-DAY WORK XXX REQUEST
TO REVIEW THE ORDERS AND RESTORE THE POSTS WITH IMMEDIATE EFFECT = ..........
Branch/Divisional/Circle Secretary.
D.
THEAGARAJAN M. KRISHNAN
Secretary General FNPO Secretary General NFPE
No comments:
Post a Comment