Test Footer

Welcome to AIPEU, Group-C,Secunderabad Division,Telangana Circle.Make A Grand Success,March to Parliament on December 15th For more news visit http://aipeugroupctelangana.blogspot.in

Wednesday, December 12, 2012


రెడ్ సెల్యూట్            కామ్రేడ్స్            రెడ్ సెల్యూట్ 

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 12-12-2012 ఒక్క రోజు సమ్మె విజయవంతం 
 మన సర్కిల్ లో  ఎన్ .ఎఫ్.పి .యి సంఘాలన్నింటి తో పాటు జి. డి. ఎస్ ఉద్యోగులు కూడా దాదాపు అన్ని డివిజన్ లలో  80 - 100% పాల్గొన్నట్లు  సమాచారం. ఒకటి, రెండు డివిజన్లు మినహా (5-10%) అన్ని డివిజన్లలో  సమ్మె సంపూర్ణ విజయం.

సమ్మె లో పాల్గొన్న ప్రతి జి.డి.ఎస్ కు హార్దిక అభినందనలు.  

దేశ వ్యాప్తంగా 90% పైగా బ్రాంచ్ అఫీసులతో పాటు డిపార్టుమెంటు ఆఫీస్ లు , ఆర్. ఎం.ఎస్ ఆఫీసులు మూసివేత-- 
మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు -- ఇన్ కం టాక్స్ , ఆడిట్ & అకౌంట్స్,  ప్రింటింగ్ & స్టేషనరీ, జియోలజికల్  సర్వే ఆఫ్ ఇండియా, కస్టమ్స్ & సెంట్రల్ ఎక్సైజ్, మైన్స్ , సి. జి.హెచ్ ఎస్.,  గ్రౌండ్ వాటర్ బోర్డ్, సి.పి .డబ్ల్యు.డి., సెన్సస్, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ అకౌంట్స్, ఇస్రో  వంటి సుమారు 60 కి పైగా  కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు 80% పైగా సమ్మె లో పాల్గొని సంపూర్ణ విజయం సాధించారు.  కొన్ని శాఖలలో 100%, కొన్నింటిలో 70 - 80 % సమ్మె జరిగినట్లు సమాచారం. సరాసరిన దేశవ్యాప్తంగా 75 -80% సమ్మె ప్రభావం కనిపించినది. 

ఎన్ .ఎఫ్. పి .ఇ   యిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొన్ని సర్కిల్స్ లో 100%, కొన్ని సర్కిల్స్ లో 75-80% సమ్మె జరిగినట్లు సమాచారం. సుమారు 80% పైగా పోస్టల్, ఆర్. ఎం.ఎస్., మరియు బ్రాంచ్ ఆఫీసులు మూసివేయ బడినవి. డెలివరీ పూర్తిగా నిలిచి పోయినది. 70 - 100% గ్రామీణ డాక్ సేవక్ లు సమ్మె లో పాల్గొన్నట్లు సమాచారం. పోస్టల్ అకౌంట్స్, రీజినల్ ఆఫీసులలో 80% పైగా సమ్మె లో పాల్గొన్నారు. 

కా.. బాబు తారాపద, కా.. కే.జి. బోస్, కా..ఎన్ .జె .అయ్యర్ , కా..ఆది నారాయణ వంటి నాయకుల త్యాగము, స్ఫూర్తి తో , తపాల ఉద్యోగుల, ఆర్.ఎం.ఎస్ ఉద్యోగుల , జి.డి.ఎస్. ఉద్యోగుల ఐక్యతతో పాటుగా యితర  కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యత  ను మరో సారి రుజువు చేయడం జరిగినది. 

కాన్ఫెడరేషన్ వ్యతిరేకత, ఎన్ .ఎఫ్.పి .ఇ  వ్యతిరేకత ను వెలిబుచ్చే సందేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా  ....... పోస్టల్, ఆర్.ఎం.ఎస్., బ్రాంచ్ ఆఫీసులలో  తపాల సేవలను ఎన్ .ఎఫ్.పి .యి మాత్రమే నిస్తేజము చేయగలదని ఈ సమ్మె రుజువు చేసినది. 

ఈ సమ్మె చార్టర్ లోని 15 డిమాండ్లు పరిష్కరించ బడని పక్షములో  నిరవధిక సమ్మె కు కూడా సిద్దం గావలసినది గా కోరడమైనది. 
  
RED SALUTE
COMRADES  ----   RED SALUTE

No comments:

Post a Comment