IMPACT OF 12.12.12 STRIKE
తే.12-12-2012 ది సమ్మె విజయవంతం అయిన తరువాత --
7వ వేతన కమిటీ నియమించ వలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల డిమాండ్ --
మరియు 2013, ఫిబ్రవరి 20, 21 తేదిలలో రెండు రోజుల దేశ వ్యాప్త సమ్మె ను మరింత విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం పై వత్తిడి చేసి 2013 ఫిబ్రవరి బడ్జెట్ లోనే 7వ పే కమిషన్ నియామకం పై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని సన్నద్ద మవుతున్నాయి.
7వ పే కమిషన్ నియామకం పై ప్రభుత్వ నిర్ణయాన్ని 2013 ఫిబ్రవరి బడ్జెట్ లో ప్రకటించాలని కోరుతూ దేశములోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలు -- CITU, BMS, INTUC, AITUC, HMS, AIUTUC, TUCC, AICCTU, UTUC, LPF & SEWA మొ.. నవి., 03-01-2013 తేదిన ఆర్ధిక మంత్రి శ్రీ పి . చిదంబరం గారు ఏర్పాటు చేసిన ప్రి-బడ్జెట్ సమావేశములో ఒక సంయుక్త మెమొరాండం సమర్పించడం జరిగినది.
మరియు ఉద్యోగులకు వైద్య, విద్య, గృహ సంబంధ సౌకర్యాలను మినహాయిస్తూ ఇన్ కం టాక్స్ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచాలని కోరడం జరిగినది.
-- 7వ వేతన కమిషన్ పై పార్లమెంట్ లో ప్రశ్న --
మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 26-07-2012 పార్లమెంట్ మార్చ్ మరియు 12-12-12 సమ్మె తరువాత -- 226వ (ప్రస్తుత ) పార్లమెంట్ సమావేశాలలో, రాజ్య సభలో గౌరవ సభ్యులు శ్రీ బల్విందర్ సింగ్ గారు 09-08-2012 తేదిన "7వ పే కమిషన్ నియామకం పై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయ వలసినదిగా " కోరుతూ అడిగిన ప్రశ్న కు ప్రభుత్వం సమాధానం యివ్వవలసియున్నది.
No comments:
Post a Comment